- Advertisement -
దర్శకుడు రామ్గోపాల్ వర్మపై చీటింగ్ కేసు నమోదైంది. శేఖర్ రాజు అనే వ్యక్తి దగ్గర ఆర్జీవీ రూ. 56 లక్షలు అప్పు తీసుకున్నారు ఈ విషయంలో డబ్బులు తిరిగి ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారని శేఖర్ రాజు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు సూచనల మేరకు మియాపూర్ పీఎస్లో కేసు నమోదైంది.
ఆర్జీవీ తీసిన దిశ సినిమా కోసం రూ. 56 లక్షలు తీసుకున్నారని రిలీజ్ అయిన తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వలేదని పేర్కొన్నారు శేఖర్ రాజు. దీంతో కోర్టు ఆదేశాల ప్రకారం ఆర్జీవీపై 406,417,420,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై ఆర్జీవీ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి..
- Advertisement -