చౌర్య పాఠం…అదిరిపోతుంది

27
- Advertisement -

ధమాకాతో మ్యాసీవ్ బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు త్రినాధరావు నక్కిన అప్ కమింగ్ క్రైమ్ కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’ తో నిర్మాతగా మారారు. నక్కిన నెరేటివ్స్ బ్యానర్‌పై నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో ఇంద్ర రామ్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్.వి.ఎస్.ఎస్. సురేష్ సహ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ని గ్రాండ్ గా లాంచ్ చేసి ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటే, టీజర్ అద్భుతంగా అలరిస్తుంది.

గ్రామంలో దోపిడీకి తన ముఠాను హీరో సిద్ధం చేయడంతో టీజర్ ప్రారంభమవుతుంది. అతను మిషన్‌లోని 4 ముఖ్యమైన విషయాలను వారికి చెప్పాడు. 1. వారు డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్స్ అని గ్రామస్తులను నమ్మించేలా చేయాలి. 2. వాకీ-టాకీ లో మాత్రమే మాట్లాడుకోవాలి. 3. కోడ్ భాషలో మాత్రమే వాడాలి. 4. వారి దాచిన ఆయుధాలు వారికి మాత్రమే కనిపించాలి. వారు తమ మిషన్‌ను ఎలా అమలు చేస్తారు అనేది కథ ముఖ్యాంశం.

సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి ఆసక్తికరమైన కథను అందించగా, నిఖిల్ గొల్లమారి అద్భుతంగా రూపొందించారు. క్యారెక్టర్స్ డిజైన్, ప్రజంటేషన్ ఆకట్టుకున్నాయి. కూల్‌గా, స్టైలిష్‌గా కనిపించిన ఇంద్ర రామ్ తన కామిక్ టైమింగ్‌తో అలరించాడు. పాయల్ రాధాకృష్ణ కథానాయికగా నటించగా, రాజీవ్ కనకాల, మస్త్ అలీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. ఈగిల్ ఫేమ్ దావ్‌జాంద్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఫన్ టచ్ ఇచ్చారు. న‌క్కిన న‌రేటివ్స్ నిర్మాణ విలువలు అత్యున్నతంగా వున్నాయి. శ్రీ నాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఉత్తర ఎడిటర్. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఫ‌స్ట్ లుక్ & టీజర్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాధ రావు న‌క్కిన మాట్లాడుతూ.. న‌క్కిన న‌రేటివ్స్ బ్యానర్ ఈ రోజు ప్రారంభమైయింది. ఈ వేడుకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన నిర్మాతలు, దర్శకులు, రచయితలు, స్నేహితులు, మీడియా అందరికీ ధన్యవాదాలు. అందరూ నిర్మాత అంటుంటే వినడానికి చాలా కొత్త ఆనందంగా వుంది. దీనికి కొనసాగిస్తాను. చౌర్య పాఠం కథ ధమాకా షూటింగ్ సమయంలో నేను, కార్తిక్ లంచ్ సమయంలో మాట్లడుకున్నపుడు పుట్టింది. కార్తిక్ చెప్పిన కథ చాలా నచ్చింది. అప్పుడే ఇంద్రకి రెడీ అవ్వమని చెప్పాను. ఈ సినిమా కోసం తను చాలా ప్యాషన్ తో వర్క్ చేసాడు. చాలా పరిణితితో నటించాడు. దర్శకుడు నిఖిల్ చాలా కష్టపడ్డాడు. కార్తిక్ తో కలసి పని చేశాడు. చాలా ప్రతిభగల నటీనటులని ఎంపిక చేశాం. డేవ్ జాండ్ అద్భుతమైన మ్యూజిక్ చేశాడు. పాయల్ తెలుగమ్మాయి. చాలా చక్కగా నటించింది. ఈ సినిమా తర్వాత తను చాలా బిజీ అవుతుంది. ఇందులో పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. రవితేజ గారితో ఈగల్ లాంటి పెద్ద సినిమా చేస్తున్నప్పటికీ మామీద అభిమానంతో కార్తిక్ ఈ చిత్రానికి అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. ఇది చిన్న సినిమాలా ఎక్కడా అనిపించదు. కార్తీక్ ఘట్టమనేని, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, డేవ్ జాంద్ ఇలాంటి పెద్ద టెక్నిషియన్స్ పని చేశారు. ఉత్తర సూపర్ ఎడిటర్. ఈ చిత్రంతో హీరో ఇంద్ర, దర్శకుడు నిఖిల్ కి చాలా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. చౌర్య పాఠం టీజర్ అదిరింది. సినిమా కూడా ఇలానే అదిరిపోతుంది. న‌క్కిన న‌రేటివ్స్ ఇప్పుడే పుట్టింది. దానికి ప్రేక్షకులు ఊపిరి, భవిష్యత్ ని ఇవ్వాలి” అని కోరారు.

Also Read:ఆహాలో ‘భామాకలాపం 2’!

- Advertisement -