Chatrapathi:టీజర్ టాక్

45
- Advertisement -

వివి వినాయక్ దర్శకత్వంలో ఛత్రపతి రీమేక్‌తో శ్రీనివాస్ బెల్లంకొండ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. పెన్ స్టూడియోస్ పతాకంపై డా. జయంతిలాల్ సమర్పణలో ధవళ్ జయంతిలాల్ , అక్షయ్ జయంతిలాల్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. రీమేక్ వెర్షన్‌కి కూడా చత్రపతి టైటిల్‌ నే మేకర్స్ లాక్ చేశారు.

శ్రీరామ నవమి సందర్భంగా, థియేటర్లలో ఎలాంటి కంటెంట్ చూడబోతున్నామో చూపించడానికి టీజర్‌ను విడుదల చేశారు. ఒక సామాన్యుడు తన ప్రజల కోసం పోరాడి వారికి చత్రపతిగా మారడమే ఈ చిత్ర కథ. కాకపోతే టీజర్ లో యాక్షన్ లో ఎపిసోడ్స్ గ్లిమ్స్ ఆకట్టుకున్నాయి. నార్త్ ఆడియన్స్ కి నచ్చేలా వినాయక్ ఈ రీమేక్ ను తెరకెక్కించాడని టీజర్ చూస్తే అర్థమవుతుంది. టీజర్ కాస్త బజ్ క్రియేట్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసింది. ఛత్రపతి కి రీమేక్ గా వస్తున్న ఈ హిందీ సినిమాతో బెల్లంకొండ బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకోవాలని భావిస్తున్నాడు. మే 12న విడుదల కానున్న ఈ సినిమాపై టీజర్ ఆసక్తిని కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -