బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కొన్ని నెలలుగా ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో షూటింగ్ స్టేజీలో సినిమా ఆగిపోయిందని , రిలీజ్ కష్టమే అనే వార్తలు చక్కట్లు కొట్టాయి.
ఈ సినిమా కోసం బెల్లం కొండ మరో సినిమా చేయకుండా వెయిట్ చేస్తున్నాడు. ఫైనల్ గా ఈ రీమేక్ సినిమా అప్ డేట్ వచ్చేసింది. ఛత్రపతి రీమేక్ మే 12 న హిందీలో రిలీజవుతుంది. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాకు రీమేక్ కాబట్టి నార్త్ లో కొంత క్రేజ్ ఉండే అవకాశం ఉంది. అలాగే బెల్లంకొండ యాక్షన్ సినిమాలకు అక్కడ కొంత డిమాండ్ ఉంది. ఇవన్నీ చూస్తే ఛత్రపతి రీమేక్ కి కలిసొచ్చినట్టే అనిపిస్తుంది.
మరి డబ్బింగ్ మూవీస్ తో నార్త్ లో హీరోగా మంచి గుర్తింపు అందుకున్న శ్రీనివాస్ ఈ రీమేక్ తో అక్కడ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
ఇవి కూడా చదవండి…

