నాది ఫెయిల్యూర్ లవ్ స్టోరీ..!

239
Charmi's Love Failure
- Advertisement -

శ్రీ ఆంజనేయం,మాస్,చక్రం,రాఖి,మంత్ర సినిమాలతో టాలీవుడ్‌ అగ్రహీరోయిన్లలో ఒకరిగా వెలుగువెలిగిన బ్యూటీ ఛార్మి. తర్వాత సినిమా ఆఫర్లు లేకపోవడంతో తానే నిర్మాతగా 2015లో జ్యోతిలక్ష్మితో వచ్చిన అది పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం పూరీ కనెక్ట్స్ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న చార్మి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని తెలిపింది. కానీ రెండు విషయాల వల్ల ఆ ప్రేమ విఫలమైంది…అతడు మంచివాడే…నేనే చెడ్డదాన్ని అని తెలిపింది. పెళ్లిపై నాకు నమ్మకం లేదని…తన విషయంలో అది జరగని పని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం నేను చేస్తున్న పని నాకెంతో నచ్చిందని..కెమెరా మిస్సవుతున్నాని అస్సలు అనిపించడం లేదు. మంచి స్క్రిప్ట్‌ దొరికితేనే తప్పకుండా సినిమా చేస్తానిన తెలిపింది. నేనేంటో మా నాన్నకు తెలుసు… అందుకే నా తల్లిదండ్రులతోనే ఉండిపోవాలని అనుకుంటున్నాను అని తెలిపింది ఛార్మి.

అయితే, ఈ ఇంటర్వ్యూలో చార్మి తాను లవ్ చేసింది ఎవరినో మాత్రం చెప్పలేదు. గతంలో చార్మి…దేవి శ్రీ ప్రసాద్‌తో లవ్‌లో ఉన్నట్లు టాలీవుడ్ కోడై కూసింది.ఈ వార్తలను వీరిద్దరు ఎప్పుడు ఖండించలేదు. తర్వాత ఛార్మి…పూరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. అంతేగాదు వీరిద్దరి వ్యవహారాన్ని పూరి భార్య కూడా తప్పుబట్టిందని వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ మాత్రం ఇవేమి పట్టించుకోలేదు. ప్రస్తుతం పూరిజగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా తెరకెక్కుతున్న మెహబూబా సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది ఛార్మి.

- Advertisement -