కొత్త బిజినెస్‌లోకి పూరి-చార్మి..ఏంటో తెలుసా..!

584
puri charmi
- Advertisement -

దర్శకుడు పూరి జగన్నాథ్-సినీ నటి చార్మి కలిసి కొంతకాలంగా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ పేరుతో గతంలో ఆకాష్ పూరి హీరోగా మెహబూబా చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లను రాబట్టలేదు. తాజాగా రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్‌ని తెరకెక్కించారు. ఈ మూవీ ఈ నెల 18న విడుదల కానుంది.

ప్రస్తుతం ఈ మూవీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న వీరిద్దరు మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయనున్నారు. బి ఇస్మార్ట్ అనే బ్రాండ్ పేరుతో బట్టల వ్యాపారం చేయబోతున్నట్లుగా ఛార్మి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

త్వరలోనే ఈ సంస్థ కు సంబంధించి ఓ వెబ్ సైట్ కూడా ప్రారంభించబోతున్నారట. ప్రతి కస్టమర్ మొదటి కొనుగోలుపై 30% డిస్కౌంట్ కూడా ఇస్తున్నామంటూ ఆఫర్ కూడా ముందే ప్రకటించేసింది ఛార్మి. మరి బి ఇస్మార్ట్ బ్రాండ్ ఏ మేరకు సక్సెస్ అవుతుదో వేచిచూడాలి.

- Advertisement -