- Advertisement -
దేవభూమి ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం 4 ధామ్‌ల మూసివేత తేదీలను ప్రకటించింది. ఉత్తరాఖండ్ టూరిజం మంత్రి సత్పాల్ మహరాజ్ ఆ వివరాలు వెల్లడించారు.
నవంబర్ ఒకటిన గంగోత్రి ధామ్ తలుపులు మూసేస్తామని, యమునోత్రి ధామ్, కేదార్‌నాథ్ ధామ్ తలుపులు నవంబర్ 3న మూసివేయబడతాయన్నారు. అలాగే నవంబర్ 4న తుంగనాథ్ ధామ్ తలుపులు, నవంబర్ 17న బద్రీనాథ్ ధామ్ తలుపులు మూసివేయనున్నాయని అన్నారు.
Also Read:TTD: 31న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
- Advertisement -