దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఛార్‌ధామ్ యాత్రను నిలిపివేశారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
చార్‌ధామ్ యాత్ర సాఫీగా సాగుతోంది.. ప్రజలు ఎలాంటి రూమర్లు నమ్మొద్దు అన్నారు ఉత్తరాఖండ్ సీఎం. ఇప్పటివరకు 4 లక్షల మంది యాత్రలో పాల్గొన్నారు అన్నారు.
కేదార్‌నాథ్ యాత్రకు కూడా అన్ని సదుపాయాలు కల్పించాం… ఇతర వివరాలకు హెల్ప్ లైన్ నంబర్లు 1364 లేదా 0135-1364 సంప్రదించండి అన్నారు.
బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ సేవలను నిలిపివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భారత-పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతల నడుమ చార్‌ధామ్ యాత్రకు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.
యమునోత్రీ, గంగోత్రీ, కేదారనాథ్, బద్రీనాథ్ అనే నాలుగు పవిత్ర క్షేత్రాలకు లక్షలాది మంది భక్తులను ఆకర్షించే చార్‌ధామ్ యాత్రలో భద్రతను గణనీయంగా పెంచారు. భారతదేశం ఇటీవల పాక్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై చేపట్టిన సైనిక చర్యలతో దేశ భద్రత పట్ల ఆందోళనలు పెరిగిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భద్రతా చర్యలను అమలు చేసింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ చార్‌ధామ్ యాత్ర, ప్రాధాన్యమైన మౌలిక సదుపాయాలు, సరిహద్దు ప్రాంతాలకు భద్రతా ప్రోటోకాల్స్‌ను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read:జవాన్లకు మద్దతుగా నిలవాలి:ఓవైసీ

