చరణ్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి…

226
Charan-Sukumar Movie First Schedule complete
- Advertisement -

రాంచరణ్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైనట్లు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రదేశాల్లో చిత్రీకరించారు. చరణ్ .. సమంతా తదితరులపై ఒక పాటతో పాటు కీలకమైన కొన్ని సన్నివేశాను తెరకెక్కించారు.

 Charan-Sukumar Movie First Schedule complete

పల్లెటూరి యువకుడిగా ఆయన ఈ సినిమాలో పూర్తి మాస్ లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు ‘చిట్టిబాబు’ అని తెలుస్తోంది. వైవిధ్యభరితమైన ఈ పాత్రలో చరణ్ అదరగొట్టేస్తున్నాడని అంటున్నారు. సమంతా తొలిసారిగా చరణ్ తో జోడీకడుతుండటం అందరిలో ఆసక్తిని పెంచేస్తోంది. సమంతతో పాటు ఈ సినిమాలో, జగపతిబాబు .. ఆది పినిశెట్టి .. అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.

ఈ రోజుతో ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా చరణ్ తెలియజేశాడు. రెండవ షెడ్యూల్ ను మే 2వ వారం నుంచి ప్లాన్ చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో, ‘చిట్టిబాబు’ అనే జాలరి యువకుడి పాత్రను చరణ్ పోషిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి గ్రామీణ నేపథ్యంలో కొనసాగనుంది. దీంతో సినిమాకి ‘పల్లెటూరి మొనగాడు’ .. ‘మొగల్తూరు మొనగాడు’ .. ‘రేపల్లె’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు.

- Advertisement -