చరణ్ కోసం శంకర్ స్పెషల్ ప్లాన్

17
- Advertisement -

రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న పాన్ ఇండియా సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు మేకర్స్. ఓపెనింగ్ తోనే భారీ క్రేజ్ తెచ్చుకున్న ఈ కాంబో సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా వదల్లేదు. ఇప్పటికే లీకుల రూపంలో చరణ్ లుక్స్ బయటికొచ్చేశాయి. ఇందులో రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు చరణ్. ఈ సినిమా టైటిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేది ఎప్పుడా ? అంటూ మెగా ఫ్యాన్స్ ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా దిల్ రాజు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

RC15 నుండి త్వరలోనే ఫస్ట్ లుక్ ఉండబోతుందని శంకర్ అదే పనిలో ఉన్నారని తెలిపాడు. మార్చ్ 27న చరణ్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని శంకర్ ఈ సినిమా టైటిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. అయితే జస్ట్ ఫస్ట్ లుక్ తో పోస్టర్ రిలీజ్ చేస్తే అది శంకర్ సినిమా ఎందుకవుతుంది ? తన స్టైల్ లో గ్రాండియర్ గా ఓ స్పెషల్ గ్లిమ్స్ రెడీ చేస్తున్నాడని ఇన్సైడ్ న్యూస్.

సినిమాకి వర్క్ చేసే అందరితో సూట్ వేయించి ఫోటో ఘాట్ పెట్టి దాంతో ఎనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేసి తన యూనిక్నెస్ చూపించిన శంకర్ ఇప్పుడు కూడా అలాంటి సరికొత్త ప్లానింగ్ తో ఓ టీజర్ గ్లిమ్స్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడట. సినిమా రిలీజ్ కి ఇంకా చాలా టైమ్ ఉంది. ఈ లోపు సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు అలాగే చరణ్ ను స్పెషల్ గా విష్ చేసేందుకు శంకర్ ఓ మోషన్ పోస్టర్ గ్లిమ్స్ మాత్రమే రిలీజ్ చేయనున్నాడని తెలుస్తుంది. మరి శంకర్ చరణ్ కోసం ఏం ప్లాన్ చేస్తున్నాడో ? గ్లిమ్స్ ను ఎలా డిజైన్ చేస్తున్నాడో ?

ఇవి కూడా చదవండి…

శారీరకంగానే కాదు మానసికంగా,మీటూ

ఎన్టీఆర్ డిజాస్టర్ సినిమా మళ్ళీ వస్తుంది

ఇండస్ట్రీలో ఎన్నో చేయాలి – పూజా హెగ్డే

- Advertisement -