జక్కన్న చెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం ‘ఆస్కార్’ గెలుపు దిశగా దూసుకెళ్తుంది. ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అమెరికాలో వివిధ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో చరణ్.. గుడ్ మార్నింగ్ అమెరికా ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ‘చరణ్ గ్లోబల్ స్టార్’ అని ట్వీట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
అలాగే మరో వైపు రామ్ చరణ్‌కు అమెరికన్ నటి సారీ చెప్పింది. ఇంతకీ, రామ్ చరణ్‌కు అమెరికన్ నటి టిగ్ నొటారో ఎందుకు క్షమాపణలు చెప్పారో తెలుసా ?, కాలిఫోర్నియా వేదికగా తాజాగా జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రదానోత్సవంలో రామ్‌చరణ్ పాల్గొన్నారు. అందులో టిగ్ నొటారో వ్యాఖ్యాతగా వ్యవహరిచారు. ఐతే రామ్‌చరణ్‌ను స్టేజ్ పైకి పిలిచే క్రమంలో రామ్‌చరణ్‌లో ‘రామ్’ అని మాత్రమే పిలిచి, చరణ్ అని పిలవలేదు.
పైగా తనకు ‘చరణ్’ను ఎలా పలకాలో తెలియడంలేదని టిగ్ నొటారో కామెంట్స్ చేశాడు. అయితే, ఆ వెంటనే రామ్‌చరణ్ వద్దకు వెళ్లి నటి టిగ్ నొటారో సారీ చెప్పారు. పర్వాలేదు అన్నట్టు చరణ్ ఆమెకు నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. మొత్తానికి చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా తన ప్రభావం గట్టిగా చూపిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి…