శర్వా పెళ్లి వేడుకల్లో చరణ్ సందడి

33
- Advertisement -

టాలీవుడ్‌ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి సందడి మొదలైంది. శర్వా, రక్షిత రెడ్డి ఏడడుగుల సాక్షిగా మూడుముళ్ల బంధంతో ఒకటవ్వబోతున్నారు. పెళ్లి వేడుక రాజస్థాన్‌లో జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో సమక్షంలో వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో నిన్న హల్దీ సంబురంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: మహేష్ కు డ్యామేజ్ తప్పదా ?

శుక్రవారం రాత్రి జరిగిన హల్దీ, సంగీత్‌ వేడుకల్లో శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్‌ రామ్ చరణ్ హాజరైన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. శర్వానంద్ స్నేహితులు రామ్ చరణ్, అఖిల్ అక్కినేని, రానా దగ్గుబాటి కూడా హాజరైనట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద శర్వానంద్ పెళ్లితో హాట్ టాపిక్ అయ్యారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.

Also Read: రీరిలీజ్‌ లో ట్రెండ్ సెట్ చేసిన టాలీవుడ్‌

- Advertisement -