సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా అప్ డేట్ కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మొన్నామధ్య ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో బ్రేక్ తీసుకున్నారు. ఈ సినిమా కథలో మహేష్ క్యారెక్టర్ కి సంబంధించి వచ్చే ఓ ప్లాష్ బ్యాక్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని తాజాగా టీమ్ ఫిక్స్ అయ్యింది. నిర్ణయం మహేష్ దే గానీ, త్రివిక్రమ్ కూడా ఈ మార్పులకు సముఖంగా ఉన్నాడని తెలుస్తోంది.
అయితే ఈ కథలో ఇప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ కూర్చుంటే.. ఇక బ్యాలెన్స్ షూటింగ్ ఎప్పుడు ఫినిష్ చేస్తారు ? అంటూ మహేష్ ఫ్యాన్స్ నిరుత్సాహ పడుతున్నారు. ఐతే, షూటింగ్ కు బ్రేక్ ఇవ్వకుండా స్క్రిప్ట్ వర్క్ చేస్తాడట త్రివిక్రమ్. ముందుగా యాక్షన్ సీన్స్ ను షూట్ చేసుకుంటూ వెళ్తారట. యాక్షన్ సీన్స్ కోసం పీటర్ హెయిన్స్ కూడా రంగంలోకి దిగాడు. ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోన్న విషయం తెలిసిందే. డిఫరెంట్ యాక్షన్ అండ్ పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్.
ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పొలిటికల్ అనలైజర్ గా కనిపించబోతున్నాడు. రాజకీయ నేపథ్యంలో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. పైగా ఖలేజా తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నిటికీ మించి ‘అరవింద సమేత, అలా వైకుంఠపురంలో ఇలా వరుస హిట్ చిత్రాలను అందించి ఫుల్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు త్రివిక్రమ్.
ఇవి కూడా చదవండి..

