గంట క్రితం ప్రకటించిన బీజేపీ తుది జాబితాలో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 14 మందితో తుది జాబితాను ప్రకటించింది. ఇందులో తొలుత బెల్లంపల్లి నుండి కొయ్యల ఏమాజీ పేరును ప్రకటించారు. అయితే తర్వాత బెల్లంపల్లి టికెట్‌ను శ్రీదేవికి ఇస్తు మార్పులు చేసిన జాబితాను రిలీజ్ చేసింది. అలాగే అలంపూర్ టికెట్‌ను తొలుత మేరమ్మ పేరును ఖరారు చేయగా తాజాగా రాజగోపాల్ పేరును అనౌన్స్ చేసింది.
బీజేపీ తుది జాబితాను ఓసారి పరిశీలిస్తే..బెల్లంపల్లి- శ్రీదేవి,పెద్దపల్లి- దుగ్యాల ప్రదీప్,సంగారెడ్డి- దేశ్‌ఫాండే రాజేశ్వరరావు,శేరిలింగంపల్లి- రవికుమార్ యాదవ్,మేడ్చల్- ఏనుగు సుదర్శన్ రెడ్డి,మల్కాజిగిరి- ఎన్.రామచంద్రరావు,నాంపంల్లి- రాహుల్ చంద్ర,చాంద్రాయణగుట్ట- కే.మహేందర్,కంటోన్మెట్- గణేశ్ నారాయణ్,దేవరకద్ర- ప్రశాంత్ రెడ్డి,వనపర్తి- అనుజ్ఞా రెడ్డి,అలంపూర్- రాజగోపాల్,నర్సంపేట- పుల్లారావు,
మధిర- విజయరాజులకు ఇచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో అధికార బీఆర్‌ఎస్ దూసుకుపోతుండగా కాంగ్రెస్ సైతం ధీటుగా ప్రచారం చేస్తోంది. ఇక ఎన్నికల రేసులో బీజేపీ కాస్త వెనుకబడిందనే చెప్పాలి.
Also Read:ఎలక్షన్ ఫైట్.. వారసుల పోరు?