‘చంద్రుళ్ళో ఉండే కుందేలు’ ట్రైల‌ర్ విడుద‌ల..

193
Chandrullo Unde Kundelu trailer launch
- Advertisement -

మేఘన, సృజన, ప్రత్యూష, జస్వంత్ సమర్పణలో శ్రీ సిద్ధి సెవెన్ హిల్స్ క్రియేషన్స్ బ్యానర్ పై క్రాంతి చంద్, అవితేజ్, ప్రదీప్, అర్జున్, కోయల్ దాస్, సుపూర్ణ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘చంద్రుళ్ళో ఉండే కుందేలు’. వెంకటరెడ్డి ఉసిరిక దర్శకత్వంలో ధన శ్రీనివాస్ జామి, లక్ష్మీ వెంకటరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం శనివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా….

రైట‌ర్ చిన్ని కృష్ణ మాట్లాడుతూ – “ఈ సినిమాలో నటీన‌టులంద‌రూ మంచి ఈజ్‌తో న‌టించారు. ఒక‌ప్పుడు చిన్న నటులే పెద్ద స్టార్స్‌గా ఎదిగారు. వారిలాగే ‘చంద్రుళ్ళో ఉండే కుందేలు’ చిత్రంలో న‌టించిన న‌టీన‌టుల‌కు మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని కోరుకుంటున్నాను. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ బాగా క‌న‌ప‌డుతున్నాయి. ఎంటైర్ టీంకు అభినంద‌న‌లు“ అన్నారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ – “సినిమా ట్రైల‌ర్ బావుంది. సినిమా లుక్ బావున్న‌ట్లు అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడు వెంక‌ట రెడ్డి నాకు మంచి మిత్రుడు న‌టీన‌టుల‌తో చ‌క్క‌గా న‌ట‌న‌ను రాబ‌ట్టుకున్నాడు. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్ట‌ర్ బుల్‌గానిన్ వార‌ధి, స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ సినిమాల‌కు మంచి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా కూడా మంచి సంగీతం ఇచ్చి ఉంటాడ‌ని భావిస్తున్నాను. సినిమా క‌చ్చితంగా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

Chandrullo Unde Kundelu trailer launch

ఆర్ట్ ఆఫ్ లివింగ్ గ‌ణ‌ప‌తి మాట్లాడుతూ – “సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌లు నాకు మంచి మిత్రులు. సినిమా చూశాను. మంచి ఫీల్ ఉన్న సినిమా. సినిమా మంచి విజ‌యాన్ని సాధిచాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీంకు అభినంద‌నలు“ అన్నారు.

అర్ధ‌నారి ఫేమ్ అర్జున్ మాట్లాడుతూ – “అర్ధ‌నారి త‌ర్వాత నేను చేసిన సినిమా ‘చంద్రుళ్ళో ఉండే కుందేలు’ ద‌ర్శ‌కుడు వెంక‌ట్‌ నా నుండి మంచి న‌ట‌న‌ను రాబ‌ట్టుకున్నారు. ఈ సినిమాలో చేయ‌డం వ‌ల్ల కొత్త విష‌యాలు నేర్చుకున్నాను. మంచి ఫీల్ ఉన్న క‌థ‌. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది“ అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ బుల్ గానిన్ మాట్లాడుతూ – “అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌“ అన్నారు.

నిర్మాత ధన శ్రీనివాస్ మాట్లాడుతూ – “చిన్ని కృష్ణ‌ మా ట్రైల‌ర్ విడుద‌ల‌కు వేడుక‌కు రావ‌డం ఆనందంగా ఉంది. బుల్‌గానిన్ గారు చాలా మంచి మ్యూజిక్ అందించారు. మంచి ఫీల్‌తో సినిమా ర‌న్ అవుతుంది. మంచి క‌థ‌. న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ అంద‌రూ చ‌క్క‌గా స‌పోర్ట్ చేశారు. అంద‌రికీ థాంక్స్‌“ అన్నారు.

ద‌ర్శ‌కుడు వెంక‌ట‌రెడ్డి ఉసిరిక మాట్లాడుతూ – “నిర్మాత‌లు అందించిన స‌పోర్ట్ మ‌ర‌చిపోలేను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. మంచి కంటెంట్ ఉన్న సినిమా. డెఫ‌నెట్‌గా సినిమా మంచి హిట్ అవుతుంది. బుల్ గానిన్ సంగీతం, దాము న‌ర్రావుల సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు ప్ల‌స్ అవుతాయి. స‌హ‌కారం అందించిన అంద‌రికీ థాంక్స్‌“ అన్నారు.

పావనిరెడ్డి, పమేల, కీ.శే.రంగనాథ్, సుమన్, నాజర్, తనికెళ్ళ భరణి, రాజీవ్ కనకాల, సప్తగిరి, షకలక శంకర్, తాగుబోతు రమేష్, కాదంబరి కిరణ్ తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, ఆర్ట్: శివకామేష్ దొడ్డి, రాజీవ్ నాయర్, పాటలు: శ్రీమణి, కరుణాకర్ అడిగర్ల, ఫైట్స్: విజయ్, జాషువా, రాంబాబు, డ్యాన్స్: స్వర్ణ, నిక్సన్, కిరణ్, రాజు, సంగీతంః బుల్‌గానిన్‌, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: దాము నర్రావుల, నిర్మాతలు: ధన శ్రీనివాస్ జామి, లక్ష్మీ వెంకటరెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు: విశ్వనాథ్, దర్శకత్వం: వెంకటరెడ్డి

- Advertisement -