క్షిణించిన ఓవైసీ ఆరోగ్యం…లండన్ కు తరలింపు

287
Akbaruddin_
- Advertisement -

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు, చాంద్రాయణగుట్ట శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం క్షిణించింది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అక్బరుద్దీన్ ఇవాళ ఆయన ఆరోగ్య పరిస్ధితి విషమంగా మారింది. దీంతో ఆయన్ను హుటాహుటిన లండన్ తరలించారు. మెరుగైన వైద్యం కోసం లండన్ తీసుకెళ్లాలంటూ హైదరాబాద్ వైద్యులు సూచించిన నేపథ్యంలో, అసద్ తన తమ్ముడ్ని అత్యవసరంగా విదేశాలకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

గతంలో చందాయణగుట్ట సమీపంలో అక్బరుద్దీన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి నుంచి తృటిలో ప్రాణాలతో అక్బరుద్దీన్‌ బయటపడినా.. అప్పట్లో తీవ్ర గాయాలు కావడంతో ఆయన ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. తన సోదరుడు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేయాలని అసద్ ఎంఐఎం అభిమానులకు విజ్ఞప్తి చూశారు.

- Advertisement -