నేడు నింగిలోకి చంద్రయాన్2

231
Chandrayaan 2
- Advertisement -

గత వారం సాంకేతిక కారణాలతో వాయిదా పడ్డ చంద్రయాన్ 2 నేడు నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్దమైంది. మరికొన్ని గంటల్లో జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక నింగిలోకి వెళ్లనుంది. ఇందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అన్ని ఏర్పాట్లూ చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2.43గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో ఈ ప్రయోగం జరగనుంది. గతంలో లాగా ఎలాంటి లోపాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు శాస్త్రవేత్తలు.

ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలంతా సవాల్‌గా తీసుకున్నారు. ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ నిన్న సాయంత్రం షార్‌కు చేరుకుని శాస్త్రవేత్తలతో సమీక్షించారు. యోగానంతరం చంద్రుడిపై దిగనున్న రోవర్ సెకనుకు సెంటీమీటరు వేగంతో 14 రోజులు పయనించనుంది.

చంద్రుడి ఉపరితలంపై ఉన్న పదార్థాలను విశ్లేషించి ఆ సమాచారంతోపాటు అక్కడి ఫొటలను కూడా ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలకు పంపిస్తుంది. ముఖ్యంగా చంద్రుడిపై నీటి ఆనవాళ్ల గురించి పరిశోధిస్తుంది. అలాగే, ఖనిజాలు, రాతి నిర్మాణాలపైనా పరిశోధనలు చేస్తుంది. చంద్రయాన్‌-2 ప్రయోగానికి నిన్న సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ చంద్రయాన్ 2కోసం ఎదురుచూస్తున్నారు.

- Advertisement -