భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–2 రాకెట్ ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. అయితే ఇంతకు ముందే ఈ నెల 15న ఈ ప్రయోగం జరగాల్సివుండగా.. టెక్నికల్ లోపంతో ఆగిపోయింది. జీఎస్‌ఎల్ మార్క్3–ఎం1 రాకెట్‌లోని క్రయోజనిక్ దశలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సవరించి మళ్లీ ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు.
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో అధికారిక ప్రకటన చేసింది. జూలై 22, మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్-2 రాకెట్ ప్రయోగం ఉంటుందని తెలిపింది. కాగా, రాకెట్ లో కనుగొన్న సాంకేతిక లోపాలను ఇప్పటికే సవరించామని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దఫా ఎటువంటి ఆటంకాలు కలుగకుండా రాకెట్ ప్రయోగం జరగాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారు.
Chandrayaan-2 launch, which was called off due to a technical snag on July 15, 2019, is now rescheduled at 2:43 pm IST on Monday, July 22, 2019. #Chandrayaan2 #GSLVMkIII #ISRO
— ISRO (@isro) July 18, 2019