బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రిగా చంద్రశేఖర్

54
- Advertisement -

బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రిగా నియమితులయ్యారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సన్నిహితుడు చంద్రశేఖర్ తీవారి జి. ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్ర సంఘటన మంత్రిగా కొనసాగుతున్నారు చంద్రశేఖర్. రాజస్థాన్ లో బీజేపీ అధికారంలోకి రావడానికి చంద్రశేఖర్ కీలక సూత్రధారి .

2017 లో ఉత్తరప్రదేశ్ లో కూడా బీజేపీ అధికారంలోకి రావడానికి చంద్రశేఖర్ కారణమే. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ పార్టీని గాడిన పెట్టి సంస్థాగతంగా బలోపేతం చేయడంలో చంద్రశేఖర్ దే కీలక పాత్ర పోషించారు.
ఆర్ఎస్ఎస్ ప్రచరక్ గా ప్రారంభమైన చంద్రశేఖర్ కెరీర్ 2013 లో బీజేపీ లో చేరిన తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ బీజేపీ క్లిష్టమైన పరిస్థితుల్లో రాజస్థాన్ , ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసి ప్రధాని మోడీకి మరియు అమిత్ శా కి అత్యంత సన్నిహితుడిగా బీజేపీ లో అందరికీ సుపరిచితుడు.

వారణాసి నుండి ప్రధాని మోడీ ఎంపిగా గెలిచిన తర్వాత ఇతనికి మిని – పీఎంఓ బాధ్యతలు ఇచ్చారని తెలుస్తోంది. చంద్రశేఖర్ తీవారిజి తెలంగాణకు బీజేపీ సంఘటన మంత్రిగా ఎంపిక కావడంతో ప్రస్తుతం బీజేపీకి మంచి రోజులు వచ్చాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ సంక్షోభంలో, విభేదాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ తరుణంలో బీజేపీని గాడిలో పెట్టడానికి చంద్రశేఖర్ తీవారి సరైన వ్యక్తి అని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Also Read:సగ్గుబియ్యంతో ఆ సమస్యలు దూరం..!

- Advertisement -