చంద్రముఖి 2..లేటెస్ట్ అప్‌డేట్

44
- Advertisement -

స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘవ లారెన్స్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోంది. సీనియర్ డైరెక్ట‌ర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. డిఫ‌రెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల‌తో పాటు భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మిస్తోన్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమాను అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తోంది.

ఆల్రెడీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రిలీజ్ గా ఫిక్స్ చేయగా లేటెస్ట్ గా అయితే మన తెలుగు స్టేట్స్ డిస్ట్రిబ్యూషన్ పై క్లారిటీ వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ వినాయక చవితి కానుకగా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ వెచ్చించి ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

Also Read:హ్యాపీ బర్త్ డే..మెగాస్టార్

- Advertisement -