సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘చంద్రముఖి’. సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. విడుదలైన ప్రతీ చోటా మంచి టాక్ సంపాదించుకుంది. రజినీతో పాటు జ్యోతిక, నయనతార కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్‌లు ఇచ్చి ఈ సినిమా విజయంలో కీలక పాత్రలు పోషించారు.
తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ వస్తుండగా రజనీకాంత్ ప్లేస్‌లో లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు చంద్రముఖి 2 అనే టైటిల్ ఖరారు చేయగా కంగనా రనౌత్ ప్రధానపాత్రలో నటిస్తోంది. జూలై 31న ఉదయం 10 గంటలకి “చంద్రముఖి 2” ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ వెల్లడించారు.
Also Read:పచ్చి బఠానీలతో.. ఆరోగ్యం !
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, దర్శకుడు పి.వాసు ఈ హార్రర్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా తోట తరణి, ఆర్.డి.రాజశేఖర్ వంటి టెక్నీషియన్స్ పనిచేస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read:పుదీనాతో ఉపయోగాలు..