ఇంద్రకీలాద్రిలో చంద్రబాబు

11
- Advertisement -

విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయ అర్చకులు చంద్రబాబు కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందజేసి శాలువాలతో సత్కరించారు.

సీఎంగా విజయవాడకు వచ్చిన సందర్భంగా తొలిసారి గన్నవరం ఎయిర్‌పోర్టులో టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు , దేవదాయ శాఖ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఆలయ ఈవో తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.

గురువారం తిరుమల లో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేష్‌ , సతీమణి బ్రాహ్మణి, మనువడు దేవాన్ష్ ఉన్నారు.

Also Read:40 శాతం మంది ప్రజలు మనవైపే:జగన్

- Advertisement -