దుర్గమ్మ సన్నిధిలో ఏపీ సీఎం చంద్రబాబు

2
- Advertisement -

విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయానికి వచ్చిన సీఎంకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.

కొత్త సంవత్సరంలో రాష్ట్రానికి మేలు జరుగాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు చంద్రబాబు. సీ నూతన సంవత్సరం తొలిరోజు ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వివరించారు.

- Advertisement -