chandrababu:చంద్రబాబు వ్యూహమా.. జగన్ వైఫల్యమా?

18
chandra babu
- Advertisement -

ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మద్య రసవత్తరమైన పోరు నడుస్తోంది. రెండు పార్టీలు కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్షంగా పావులు కడుపుతున్న వేళ ఇరు పార్టీల అధినేతలు అమలు చేస్తున్న వ్యూహాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిని బయటపెడుతూ వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజల దృష్టిని వైసీపీనే ఉంచేలా చూస్తున్నారు సి‌ఎం జగన్. మరోవైపు ప్రస్తుతం జగన్ పాలనలో పెరిగిన ధరలను, అసమర్థ పాలనను ఎండగడుతూ ” సైకిల్ రావాలి సైకో పోవాలి ” అనే నినాదంతో ప్రజలను ఆకర్షిస్తున్నారు చంద్రబాబు. ఇలా నువ్వా నేనా అని సాగుతున్న రాజకీయ సమయంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీకి షాక్ ఇచ్చి టీడీపీకి బలనిచ్చాయి. పట్టభద్రుల ఎన్నికల్లో మూడు స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది.

ఇది నిజంగా వైసీపీకి ఏ మాత్రం మిగుడు పడని విషయమే. ప్రజాల్లో జగన్ పాలనపై వ్యతిరేకత మొదలైందని, దానికి ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమని భావించిన టీడీపీ మరింత జోరు పెంచింది. ఇదే ఊపులో చంద్రబాబు వ్యూహాలకు పదును పెడుతూ వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేలపై గట్టిగానే ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పక్షాన నిలిచిన ఆనం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి లను వైసీపీ ఇప్పటికే సస్పెండ్ చేయగా త్వరలోనే వీరు టీడీపీ గూటికి చేరే అవకాశం ఉంది. ఇంకా మరికొంత మంది వైసీపీ నేతలు కూడా జగన్ వ్యవహార తీరు పై అసంతృప్తిగా ఉన్నారట. వారిని కూడా సమయం చూసి చంరబాబు వ్యూహాత్మకంగా పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉందని పోలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న ఇన్ సైడ్ టాక్.

అయితే ఇలా వరుసగా వైసీపీకి ఎదురు దెబ్బలు తగలడానికి ఆయా విధానాల్లో జగన్ వైఫల్యాలే కారణం అనే టాక్ నడుస్తోంది. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజల్లోకి వెలుతున్న వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందట. రోడ్ల విషయంలోనూ, ధరల విషయంలోనూ నేతలపై ప్రజలు గట్టిగనే మండిపడుతున్నారు. వీటన్నిటిని సి‌ఎం దృష్టికి తీసుకెళ్లిన పెద్దగా ప్రయోజనమేమీ లేకపోవడంతో పలువురు ఎమ్మేల్యేలు ప్రభుత్వ తీరుపై అసమ్మతిగా ఉన్నారట. అలాగే పార్టీ బాద్యతల విషయంలో కూడా సజ్జల సూచించిన వారికే జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారానే టాక్ కూడా నడుస్తోంది. దీంతో పార్టీలోని చాలమంది నేతలు నివురుగప్పిన నిప్పులా ఉంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా జగన్ వైఫల్యాలన్నిటిని చంద్రబాబు వ్యూహాత్మకంగా తనకు అనుకూలంగా మార్చుకుంటూ టీడీపీకి బలం పెంచుతున్నారు. మరి ఎన్నికల సమయానికి ఈ రెండు పార్టీల మద్య రాజకీయ రగడ మరింత రంజుగా మారే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి…

KTR: BRS..భారత రైతు సమితి

cmkcr:రాహుల్‌ అనర్హతను ఖండించిన సీఎం..

526మి. డాలర్లు ఆవిరైన డోర్సే సంపద..!

- Advertisement -