11న సీఎంగా బాబు ప్రమాణస్వీకారం..

11
- Advertisement -

ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 11న ఉదయం 11గంటల 27 నిమిషాలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు చంద్రబాబు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ ను ఎంపిక చేశారు. మంగళగిరి ఎయిమ్స్ స్థలం కంటే ఐటీ పార్క్ స్థలం అనువైనదిగా టీడీపీ నేతలు భావించారు. చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవానికి ప్రధాని మోడీతో పాటు పలువురు ముఖ్యమంత్రులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరుకానున్నారు.

Also Read:ఏ మాస్టర్ పీస్..సూపర్ హీరో మూవీ

- Advertisement -