మెగా డీఎస్సీపై బాబు తొలి సంతకం

12
- Advertisement -

ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు. సాయంత్రం 4.41 గంటలకు సీఎం చాంబర్ లో బాధ్యతలు తీసుకోగా తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ డీఎస్సీ నోటిఫికేషన్ పైనే తొలి సంతకం చేశారు.

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పెట్టారు. సామాజిక పింఛన్ రూ.4 వేలకు పెంచుతూ ఫైల్ పై మూడో సంతకం చేశారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, నైపుణ్య గణనపై 5వ చేశారు సీఎం చంద్రబాబు.

ఇక అంతకముందు సచివాలయానికి బయలుదేరిన చంద్రబాబుకు అడుగడుగున ఘన స్వాగతం లభించింది.

Also Read:‘డకాయిట్’లో జాయిన్ అయిన శృతి!

- Advertisement -