ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. కేసరపల్లిలోని ఐటీటవర్ వద్ద ఉదయం 11.33 గంటలకు సీఎంగా చంద్రబాబుతో గవర్నర్ ప్రమాణం చేయించగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో ఓ సాధారణ రైతు ఇంట జన్మించారు. యూత్ కాంగ్రెస్ నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు చంద్రబాబు. 1978 ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబు పెళ్లి చేసుకున్నారు.
1983 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి చంద్రబాబు పోటీచేసి ఓడిపోయారు. ఆ తరువాత ఏడాదిలోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న అనేక రాజకీయ సంక్షోభాలను తిప్పికొట్టడంలో చంద్రబాబు తన మార్క్ ను చూపించారు.
1995లో మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ,1996లో యునైటెడ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంలో చంద్రబాబు కీలకంగా పనిచేశారు. ఎన్డీయే కన్వీనర్ గా పని చేశారు.199లో మళ్లీ సీఎంగా ఆ తర్వాత 2014లో మూడోసారి సీఎంగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికలకు ముందు 208 రోజులు, 2817 కిలోమీటర్ల మేర వస్తున్నా మీ కోసం పాదయాత్ర చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలవగా 2024లో భారీ మెజార్టీతో టీడపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
Also Read:తుఫాను హెచ్చరిక… ఫస్ట్ లుక్