నాలుగోసారి సీఎంగా చంద్రబాబు!

12
- Advertisement -

ఏపీలో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది టీడీపీ. ఎవరూ ఊహించని విధంగా టీడీపీ తెలుగు రాజకీయాల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ నెల 9న నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

160 స్థానాలకుపైగా కూటమి మెజార్టీ కొనసాగుతోంది. వైసీపీ కేవలం 15 స్థానాల్లో మాత్రం లీడింగ్‌లో ఉంది. కూటమి ప్రధాన అభ్యర్థుల్లో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 40 వేలకుపైగా మెజార్టీలో ఉండగా.. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 9 వేలకుపైగా మెజార్టీలో కొనసాగుతున్నారు. రాజమండ్రి రూరల్‌లో 63 వేలకుపైగా మెజార్టీతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు.

Also Read:కూటమి క్లీన్ స్వీప్ – మూడో స్ధానంలో వైసీపీ..!

- Advertisement -