ఏపీ సీఎంగా చంద్రబాబు ఇవాళ సాయంత్రం బాధ్యతలు తీసుకోనున్నారు. సాయంత్రం 4 గంటల 41 నిమిషాలకు బాధ్యతలు స్వీకరించనుండగా తర్వాత మంత్రులకు శాఖలను కేటాయించనున్నారు చంద్రబాబు. పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాబివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించే ఛాన్స్ ఉంది.
నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలను ఇవ్వనున్నట్లు సమాచారం. మరి బీజేపీకి ఎలాంటి శాఖ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇక ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఐదు హామీలపై సంతకాలు చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన విధంగా తొలి సంతకం మెగా డీఎస్సీపై సంతకం చేయనున్నారు. ప్రస్తుతం విద్యా సంస్థల్లో 13 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమిక అంచనా. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,మూడోది అధికారంలోకి రాగానే పింఛను 4 వేలకు పెంచుతాం, నాలుగో హామీ అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ,ఐదోది యువతకు నైపుణ్య గణన దస్త్రంపై సంతకం చేయనున్నారు.
Also Read:శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు