బీఎస్ఎన్ఎల్ 4జీ సేవల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ కార్యక్రమం జరుగగా సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజాల్, పలువురు అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత ప్రధాని మోదీది అన్నారు. మన దేశ ప్రజలనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజల ప్రాణాలు కూడా కాపాడుకున్నాం… సింగపూర్, ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా మనం తెచ్చిన UPI ని అడాప్ట్ చేసుకుంటున్నారు అన్నారు.
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఎట్టకేలకు తన 4జీ సేవలు ప్రారంభించగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన టెక్నాలజీని వినియోగించనున్నారు. క్లౌడ్ ఆధారిత సేవలను 5జీ సేవలుగా అప్‌గ్రేడ్ చేసుకునేందుకు వీలుంటుందని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా తెలిపారు. దేశవ్యాప్తంగా 98 వేల సైట్లలో ఈ నూతన సేవలు అందుబాటులోకి రానున్నట్టు ఆయన వెల్లడించారు.
Also Read:TG:స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు

