ఏపీలో పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీపై చంద్రబాబు

3
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాష్ట్ర జనాభా నిర్వహణ (పాపులేషన్ మేనేజ్‌మెంట్) విధానంపై కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కొత్త జనాభా విధానానికి రూపకల్పన చేస్తున్నామని ఆయన తెలిపారు.

2023 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 6.70 లక్షల మంది పిల్లలు జన్మిస్తున్నారని సీఎం వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (ఫెర్టిలిటీ రేట్) 1.5గా ఉందని చెప్పారు. అయితే సుస్థిర అభివృద్ధి కోసం ఈ రేటు కనీసం 2.1గా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారని తెలిపారు.

భవిష్యత్తులో జనాభా నిర్మాణంలో పెద్ద మార్పులు వచ్చే అవకాశముందని చంద్రబాబు అన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల జనాభా గణనీయంగా పెరిగే పరిస్థితి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇది ఆర్థిక, సామాజిక రంగాలపై ప్రభావం చూపే అవకాశముందని చెప్పారు.

ఇప్పటివరకు ప్రభుత్వాలు ప్రధానంగా కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చాయని, కానీ మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కొత్త విధానాన్ని రూపొందిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.

రాష్ట్రంలో సమతుల్య జనాభా పెరుగుదల, భవిష్యత్ ఆర్థిక అవసరాలు మరియు వృద్ధుల సంరక్షణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని డ్రాఫ్ట్ పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీని సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ విధానం రాష్ట్ర అభివృద్ధికి దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

- Advertisement -