Chandrababu:వైసీపీలో ఉన్నవారంతా చరిత్రహీనులే

3
- Advertisement -

వైసీపీలో చరిత్రహీనులు.. క్రిమినల్స్ ఉన్నారు అని మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. అలాంటి వాళ్లతో రాజకీయం చేయాల్సి రావటం మన కర్మ అన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనల్లో కుట్రలు ఉన్నాయనే అనుమానం కూడా కలుగుతోందన్నారు.

వైసీపీ వాళ్లు కరకట్లకు గండి కొడతారన్న అనుమానంతో గట్లు వెంట పెట్రోలింగ్ పెట్టాల్సి వచ్చిందన్నారు. వైసీపీ మీడియాలో ప్రతి విషయంపై విష ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.

మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు చంద్రబాబు. వ చంద్రబాబు విజయవాడలోనే మకాం వేసి… రాత్రింబవళ్లు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా బాధిత ప్రాంతాలకు వెళ్లి బాధితులకు ధైర్యం చెపుతున్నారు.

Also Read:భారీ వర్షాలు..ఉద్యోగులు రూ.100 కోట్ల విరాళం

- Advertisement -