వైసీపీ పాలనపై చంద్రబాబు ఫైర్

5
- Advertisement -

ఐటీ ప్రభావం గురించి నేను 30 ఏళ్ల కిందటే చెప్పాను … టెక్నాలజీ గురించి ఆరోజు నేను చెప్తే ఎవరూ నమ్మలేదు అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నమ్మకపోగా కొందరు నన్ను 420 అన్నారు… కేవలం ఆరేడు దేశాల్లోనే ఉన్న క్వాంటం కంప్యూటర్ ని మొట్టమొదటిసారిగా అమరావతికి తెచ్చానన్నారు.

నేను వేసిన ఫౌండేషన్ వల్లే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా హైదరాబాద్ నిలిచింది…. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ ని మళ్లీ బిల్డప్ చేస్తాను అన్నారు. పెట్టుబడులు తెచ్చి 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు ఇస్తున్నాం అన్నారు.

Also Read:కొత్తరకం సాలీడు..ఎక్కడో తెలుసా?

గత వైసీపీ పాలనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధి ఉన్న వాళ్లు ఎవరూ ఇలాంటి తప్పుడు పనులు చేయరు.. వైఎస్ జగన్ విధ్వంస విధానాలతో పరిశ్రమలు మూతపడ్డాయి..పారిశ్రామికవేత్తలు పారిపోయారు అన్నారు.

- Advertisement -