శ్రీవారి నామమే వినిపించాలి:చంద్రబాబు

6
- Advertisement -

ఓం నమో వేంకటేశాయ తప్ప వేరే నినాదం వినిపించొద్దు అని టీటీడీ అధికారులకు సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన చంద్రబాబు..రాష్ట్రంలో ప్రజా పాలన మొదలైందని చెప్పారు.

తిరుమల నుండే ప్రక్షాళన ప్రారంభమైందని..గతంలో అలిపిరిలో తనపై జరిగిన దాడిలో నన్ను వెంకటేశ్వర స్వామి బతికించారని గుర్తు చేసుకున్నారు. ఏ పని చేసినా వెంకన్న సంకల్పంతోనే చేస్తానని..తాను రాష్ట్రానికి ఇంకా ఏదో చేయాల్సి ఉంది కాబట్టే ఆ రోజు నన్ను దేవుడు కాపాడారని అన్నారు.

గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి అపార నష్టం జరిగిందని.. దానిని గాడిలో పెట్టి.. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.ఏపీ రాష్ట్రం మొత్తం శ్రీవారి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవారికి వెళ్లడం కూడా అంతే ముఖ్యమని సీఎం అన్నారు.

Alsp Read:40 శాతం మంది ప్రజలు మనవైపే:జగన్

- Advertisement -