రిమాండ్ పొడిగింపు.. మళ్ళీ వాయిదా!

29
- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చేలా కనిపించడం లేదు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు లో అరెస్ట్ అయిన ఆయనకు కోర్టులో ఎప్పటికప్పుడు నిరాశే ఎదురవుతోంది. తాజాగా మరోసారి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ మరియు కస్టడీ పిటిషన్లపై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరగగా.. రెండు విచారణల్లోనూ బాబు ప్రతికూలంగానే ఫలితాలు వచ్చాయి. స్కిల్ల్ స్కామ్ లో ప్రధాన నిందితుడు చంద్రబాబేనాని ఆయన 13 చోట్ల సంతకాలు పెట్టారని, రూ. 27 కోట్లు టీడీపీ ఖాతాలో నేరుగా జమ అయ్యాయని సిఐడి తరుపు లాయర్లు వాదించారు. అంతే కాకుండా 14 రోజులు విహరణ నిమిత్తం చంద్రబాబుకు రిమాండ్ విధించాలని కోరగా కోర్టు అందుకు అంగీకరించింది.

దాంతో ఈ నెల 19 వరకు చంద్రబాబు రిమాండ్ పొదిగిస్తూ తీర్పునిచ్చింది. ఇక అంతకుముందు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరుగగా తీర్పు రేపటికి వాయిదా వేసింది దర్మాసనం. దాంతో రేపైన స్పష్టమైన తీర్పు వస్తుందా అంటే సందేహమే అని అభిప్రాయ పడుతున్నారు విశ్లేషకులు. దీంతో చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు మరింత బలహీన పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ రేపు చంద్రబాబుతో మూలాఖత్ కానున్నారు. దీంతో మూలాఖత్ లో చంద్రబాబు నారా లోకేశ్ కు ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ ఎన్డీయే కూటమిలో చేరబోతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో జనసేన అనూహ్యంగా ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చింది. దీంతో ఈ తాజా పరిస్థితులను నారా లోకేశ్ చంద్రబాబుకు వివరిచే అవకాశం ఉంది.

Also Read:సంక్రాంతి రేసులో ‘సైంధవ్’

- Advertisement -