మా నమ్మకం ఆయనపైనే..వారికి ఈసారి భంగపాటే!

23
- Advertisement -

ఏపీలో రెండోసారి వైసీపీనే విజయం వరించనుందా?,ఎన్నికల ప్రచారం మరికొద్ది రోజుల్లో ముగియనుండగా అడ్డగోలు హామీలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు కూటమి నాయకులు..?కానీ ప్రజలు ఆ హమీలను విశ్వసించటం లేదా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక ప్రధానంగా గ్రామాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలపై విస్తృత చర్చ జరుగుతోంది. బాబు వస్తే జాబు గ్యారెంటీ అని సంవత్సరానికి 4 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారు..అంటే ఓవరాల్‌గా 20 లక్షల ఉద్యోగాలు. ఇది స్వయంగా బాబుగారి నోటి వెంట వచ్చిన మాట. తొలి సంతకం ఉద్యోగాల నియామకంపైనే చేస్తానని పదేపేద చెబుతూ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. అంతేగాదు  ఉద్యోగాలు ఇచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇట్టే చెప్పేస్తున్నారు.కానీ ప్రభుత్వ రంగంలో ఇన్ని లక్షల ఉద్యోగాలు సాధ్యమేనా? అని ప్రతి ఒక్కరిని ఆలోచింప చేస్తున్న ప్రశ్న. ఎందుకంటే స్వతంత్య్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు సంవత్సరాల్లో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు.

అధికారం కోసం బాబు ఇస్తున్న హామీలపై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. హామీల అమలు సాధ్యం కాదని..కేవలం తమను మోసం చేయడానికి ఇలాంటి అబద్దపు హామీలు ఇస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వచ్చినా ఈ హామీల అమలు సాధ్యం కాదని..తలకు మించిన భారాన్ని మోయడమేనన్న  అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేగాదు 14 ఏళ్ళు సీఎంగా పనిచేసిన వ్యక్తి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని నవ్వుకుంటున్నారు. మరికొంతమందైతే తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఇప్పుడు ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఉదహరిస్తున్నారు.మొత్తంగా ఏపీ రాజకీయాల్లో విజయం మాత్రం మా నమ్మకం వైపే అంటూ పరోక్షంగా చెబుతున్నారు కూడా.

- Advertisement -