- Advertisement -
నందమూరి కుటుంబం నుంచి నాల్గవతరం హీరో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నందమూరి హరికృష్ణ మనవడు, స్వర్గీయ జానకిరామ్ కుమారుడు, నందమూరి తారక రామారావు హీరోగా వైవీఎస్ చౌదరీ దర్శకత్వంలో నిర్మిస్తున్న మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. క్లాప్ కొట్టి మూవీ ప్రారంభించింది నారా భువనేశ్వరి.ఈ కార్యక్రమానికి హాజరైన నందమూరి ఫ్యామిలీ, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఇండస్ట్రీలోకి తారక రామారావు ఎంట్రీ నేపథ్యంలో పోస్ట్ చేశారు చంద్రబాబు. తారక రామారావు గొప్ప విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తూ ‘ఎక్స్’లో చంద్రబాబు ట్వీట్ చేశారు. తారక రామారావు చాలా కష్టపడ్డాడని, భవిష్యత్తులో బాగా ఎదుగుతాడని తెలిపింది నారా భువనేశ్వరి.
Also Read:Kohli: టెస్ట్ క్రికెట్‌కు విరాట్ గుడ్ బై
- Advertisement -

