గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు , మంత్రి నారా లోకేష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సేవాలాల్ మహరాజ్ సమాజ శ్రేయస్సుకు అందించిన సేవలను ఆదర్శంగా తీసుకుని పనిచేద్దామని పిలుపునిచ్చారు.
బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ స్ఫూర్తిని భావితరాలకు అందించటానికి, ఆయన జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆయన పుట్టిన గ్రామంలో కూడా రూ.50 లక్షల నిధులు విడుదల చేసి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చాం.
బంజారాలకు ఎనలేని సేవలు అందించిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అన్నారు సీఎం చంద్రబాబు. ఆరోజుల్లోనే మూడనమ్మకాలను పోగొట్టడం కోసం సేవాలాల్ ఎంతో కష్టపడ్డారు అన్నారు. ప్రతిఫలం ఆశించకుండా పని చేయాలని సేవాలాల్ మహారాజ్ చెప్పే వారు అన్నారు.
అహింసా సిద్ధాంతాన్ని సేవాలాల్ పాటించేవారు అన్నారు.
Also Read:ఈ పండ్లు తింటే.. నో డీహైడ్రేషన్!

