రైతు రోశయ్యకు చంద్రబాబు అభినందనలు

1
- Advertisement -

ప్రకృతి సేద్యంతో విజయాన్ని సాధిస్తున్న వృద్ధ రైతు రోశయ్యను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదిక ప్రశంసలు గుప్పించారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు. గుంటూరు జిల్లాలోని కొల్లిపుర మండలం, అత్తోట గ్రామానికి చెందిన 82 ఏళ్ల రైతు రోశయ్య తన కృషితో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని సీఎం పేర్కొన్నారు.

కేవలం 75 సెంట్ల చిన్న భూమిలోనే రోశయ్య సుమారు 52 రకాల పంటలను సాగు చేస్తూ ప్రకృతి సేద్యంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులు లేకుండా పూర్తిగా సహజ విధానాల్లో సాగు చేస్తూ ఆరోగ్యకరమైన పంటలను పండిస్తున్నారు. ఈ పంటల ద్వారా ఆయన నెలకు రూ.20 వేలకుపైగా ఆదాయం పొందుతున్నట్లు సీఎం తెలిపారు.

రోశయ్య వయస్సు 82 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన ఉత్సాహం, కష్టపడే తత్వం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోందని చంద్రబాబు అన్నారు. తక్కువ భూమి ఉన్న రైతులు కూడా సరైన పద్ధతులు పాటిస్తే మంచి ఆదాయం పొందవచ్చని రోశయ్య ఉదాహరణగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

రోశయ్య విజయగాథ నిజంగా స్ఫూర్తిదాయకమని, ఆయన సాధిస్తున్న విజయాలు రాష్ట్రంలోని రైతులకు ఆదర్శంగా నిలుస్తాయని సీఎం తన పోస్టులో తెలిపారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తూ రైతులు ఇలాంటి వినూత్న పద్ధతులను అవలంబిస్తే వ్యవసాయం మరింత లాభదాయకంగా మారుతుందని కూడా చంద్రబాబు సూచించారు.

Also Read:‘పెద్ది’..క్రేజీ అప్‌డేట్ 

- Advertisement -