పవన్‌కు చంద్రబాబు ఫోన్..

128
- Advertisement -

ఏపీలో జనసేన కార్యకర్తల అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ తీవ్ర నిరసన వ్యక్తం చేయగా తాజాగా జనసేన కార్యకర్తలు నేతల అరెస్ట్‌లను ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ మేరకు పవన్‌కు ఫోన్ చేసిన చంద్రబాబు… విశాఖలో పరిణామాలపై ఆరా తీశారు.

తాజా పరిస్థితిని అడిగి తెలుసుకోగా పోలీసుల నోటీసులు, పార్టీ నేతల అరెస్ట్ అంశాలపై చంద్రబాబుకు వివరించారు పవన్. జగన్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలతో పని చేస్తోందన్నారు. పవన్ కు నోటీసులు ఇవ్వడం సరికాదన్నారని తెలిపారు.

జనవాణి కార్యక్రమం కోసం పవన్ కల్యాణ్ నగరంలో అడుగుపెట్టడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఎయిర్ పోర్టులో మంత్రులపై జనసైనికులు దాడికి పాల్పడ్డారంటూ వైసీపీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, జనసేన నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే.

- Advertisement -