- Advertisement -
గంజాయి, డ్రగ్స్ పై యుద్ధం ప్రకటిస్తున్నా అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు.. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నాం అన్నారు. శాటిలైట్, డ్రోన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గంజాయి సాగును నిర్మూలిస్తాం అన్నారు.
శాంతి భద్రతల జోలికి వస్తే సింహస్వప్నం అవుతాం అన్నారు చంద్రబాబు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి అని… నా జీవితంలో ఓ పార్టీ ఆఫీసుపై దాడి చేసిన ఘటన చూడలేదు అన్నారు. రాజకీయ కక్షలతో రాజకీయం చేయలేదు.. చేయను, టీడీపీ వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ సెట్ కావల్సిందేనని తేల్చిచెప్పారు.
ఏపీ శాసనమండలిలో జగన్ పై హోం మంత్రి అనిత సెటైర్లు వేశారు. వరద బాధితులకు జగన్ విరాళం ప్రకటనలకే పరిమితమైంది… జగన్ ఇస్తామని ప్రకటించిన రూ.కోటి ఎక్కడ..? అని ఎద్దేవా చేశారు.
Also Read:KTR: అన్నదాతల సమస్యలపై కేటీఆర్ ఆవేదన
- Advertisement -

