సీఆర్డీఏ భవనం..ఆరంభం మాత్రమే!

4
- Advertisement -

సీఆర్డీఏ భవనం ప్రారంభమైంది.. ఇది ఆరంభం మాత్రమే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్లలో మీ కష్టాలు చూశాను.. ధర్నాలు చేశారు పోరాడారు మీ పోరాటానికి నేను మద్దతు ఇచ్చాను అని తెలిపారు. అమరావతిలో CRDA ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు చంద్రబాబు. .

భూములిచ్చిన రైతులతో కలిసి భవనాన్ని ప్రారంభించారు. ఆనాడు హైటెక్ సిటీ నిర్మించినప్పుడు విజన్ చెబితే అవహేళన చేశారు. తొలిసారి ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన చరిత్ర అమరావతి రైతులది అన్నారు. రాజధాని నిర్మాణానికి భూములు అవసరం కాగా.. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిచ్చారు అన్నారు.

హైదరాబాద్‍లో 5 వేల ఎకరాల్లో ఎయిర్‍పోర్టు నిర్మించాం… ఎయిర్ పోర్టు నిర్మాణం పక్కనే భూములు కొన్నవారు బ్రహ్మాండంగా బాగుపడ్డారు అన్నారు. మొదటగా సీఆర్డీఏ భవనం ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు వస్తాయి. రైతుల అవస్థలు నేను చూశా.. రోడ్డెక్కి అనేక ఉద్యమాలు చేశారు అన్నారు. రైతులు చేసిన త్యాగాలను ఏనాడు మరవను.. అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం అన్నారు. రాజధాని ఎక్కడ ఉండాలని నేతల అభిప్రాయాలను కోరినప్పుడు చాలామంది చాలా అభిప్రాయాలు చెప్పారు. కానీ, భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకొని విజయవాడ – గుంటూర్ మధ్య ఉన్న అమరావతి రాజధానిగా ఉండాలని ఎంపిక చేశాం అన్నారు. 7 అంతస్తుల్లో 3.07 లక్షల చదరపు అడుగుల్లో CRDA భవనాన్ని నిర్మించారు.

Also Read:‘కారు’ కావాలా..’బుల్డోజర్’ కావలా: కేటీఆర్

- Advertisement -