ఆంధ్రప్రదేశ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి రానున్న రోజులు కష్టకాలమే అనిపిస్తోంది. ప్రత్యర్థులు బాబు వ్యూహాలను తిప్పికొట్టి విజయ నగార మోగించారు. గురువారం జరిగిన అసెంబ్లీ,లోక్‌సభ ఎన్నికల లెక్కింపులో వైసీపీ బారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు.
అలాగే కేంద్రంలో మళ్లీ విజయ కేతనం ఎగురవేశారు. దీంతో నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కానున్నారు. ఇక తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో తిరుగులేని విజయం సొంతం చేసుకొని ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్. ఈ ముగ్గురు బాబుకు బలమైన ప్రత్యర్థులు. బాబు ఇక రాజకీయంగా ఈ ముగ్గురు ప్రత్యర్థులతో యుద్దం చేయాలి.
ఎన్నికల నేపథ్యంలో జరిగిన ప్రచారంలో చంద్రబాబు మోడీ,జగన్,కేసీఆర్ ముగ్గురు కలిసి, టీడీపీని దెబ్బ తీయాలని చూస్తున్నారని, వారి ఆటలు సాగవని ఆయన ఎన్నిసార్లు అని ఉంటారో చెప్పలేం. చంద్రబాబుపై ఉన్న అవినీతి కుంభకోణాలు, కేసులు తిరగతోడడానికి మోడీ, కేసీఆర్, వైఎస్ జగన్ ప్రయత్నిస్తారని రాజకీయ వర్గాల బోగట్టా. అంతేకాదు జగన్ సీఎం పదవి చేపట్టగానే చంద్రబాబు ప్రభుత్వంలోని అవినీతిపై జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నాట్లు సమాచారం.
కేంద్రంలో మోడీకి వ్యతిరేకంగా బాబు చేయని ప్రయత్నమంటూ లేదు. బీజేపీయేర కూటమి ఏర్పాటుకు పలు రాష్ట్రాల ముఖ్య నేతలతో చర్చలు కూడా జరిపారు. కానీ చంద్రబాబు అనుకున్నదేదీ జరగలేదు. ఆయన అంచనాలను మించి బీజేపీ భారీ మెజారిటీ సాధించింది.