అల్లు అర్జున్‌కి సంబంధం లేకుండా తొక్కిసలాట జరిగినప్పుడు.. అల్లు అర్జున్ మీద 105BNS కేసు పెట్టారు అని గుర్తుచేశారు మాజీ మంత్రి రోజా. మరి అలాంటప్పుడు తిరుపతికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసికూడా వాళ్ళకోసం ఏర్పాట్లు చేయనప్పుడు.. చంద్రబాబు, టీటీడీ చైర్మన్, ఎస్పీ అందరు బాధ్యత వహించాలి కాదా అన్నారు.
ఎఫ్ఐఆర్లో సెక్షన్ 105BNS పెట్టకుండా సెక్షన్ 194BNS పెట్టారు.. అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది, ఎవరు కావాలని చేయలేదు అన్నట్టు చేతులు దులిపేసుకున్నారు అన్నారు.
వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం క్యూ లైన్ లో జరిగిన తొక్కిసలాటలో 6 మంది తమ నిండు ప్రాణాలని కోల్పోవడం నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేసింది.
ఈ ప్రభుత్వానికి సామాన్య ప్రజలంటే ఇంతటి నిర్లక్ష్యమా? ఘటన పై కేంద్రం కలగజేసుకొని నిర్లక్ష్యం వహించిన టిటిడి ఛైర్మన్, ఈవో, ఎస్పీ మరియు ఇతర అధికారులపై… pic.twitter.com/mqfBw0OF8Q— Roja Selvamani (@RojaSelvamaniRK) January 8, 2025