చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారు!

80
ashwini dutt
- Advertisement -

చంద్రబాబు ఏపీకి మళ్లీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు సినీ నిర్మాత అశ్వినీదత్. కంభంపాటి రామ్మోహన్ రాసిన పుస్తక ఆవిష్కరణ సభలో మాట్లాడిన అశ్వినీదత్…అతి త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.

హైదరాబాద్ ఈ స్థాయికి ఎదగడానికి, ఈ స్థాయిలో నగరానికి ఆదాయం రావడానికి బీజం వేసింది చంద్రబాబేనని తెలిపారు. రాష్ట్రానికి, దేశానికి దిక్సూచి తెలుగుదేశం పార్టీనే అని చెప్పారు. మన దేశంలో తొలిసారి వృద్ధాప్యపు పింఛన్ ఇచ్చింది దివంగత ఎన్టీఆర్ అని చెప్పారు.

చంద్రబాబు పొలిటీషియన్ కాదు.. ఒక స్టేట్స్ మెన్ అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపారని చెప్పారు. రాబోయే రోజుల్లో కంభంపాటి రామ్మోహన్ రావును మంచి పదవిలో చూస్తామని చెప్పారు.

- Advertisement -