ఏపీలో టీడీపీని అధికారంలో తెచ్చే దిశగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది జనవరిలో ప్రారంభం అయిన పాదయాత్ర ఈ నెల 20 తో ముగియనుంది. మొదట నాలుగు వేల కిలోమీటర్ల అంచనాతో పాదయాత్రను ప్రారంభించినప్పటి మూడు వేల కిలోమీటర్లకే బ్రేక్ వేశారు నారా లోకేష్. ఇక ఈ నెల 20న ముగింపు సభ ఏర్పాటు చేసి పాదయాత్రకు పూర్తి విరామం ఇచ్చేందుకు లోకేష్ ప్లాన్ చేశారు. ఇక ముగింపు సభను టీడీపీ శ్రేణులు గ్రాండ్ గా నిర్వహించే సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా హాజరవుతారని వార్తలు ఈ మద్య తెగ వినిపించాయి..
అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ అటెండ్ అవ్వడం కష్టమేనా. మరి ఇంతలోనే ఏమైందనే దానిపై రకరకాల వాదనలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. పవన్ వస్తే అందరి దృష్టి ఆయనపైనే ఉంటుందని, అక్కడ లోకేష్ మరుగున పడే అవకాశం ఉందని భావించి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పవన్ ను వద్దని చెప్పినట్లు టాక్. పాదయాత్ర లోకేష్ ది కావడంతో ముగింపు సభలో కేవలం లోకేష్ ను హైలెట్ చేసేందుకే చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట. ఇక ముగింపు సభలో ప్రజలు పలు హామీలు ప్రకటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ మినీ మేనిఫెస్టోతో పాటు.. జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో ను కూడా ప్రకటించారు. ఇక ఇప్పుడు నారా లోకేష్ ముగింపు సభలో మరికొన్ని హామీలు ప్రకటించి ప్రజల దృష్టి టీడీపీపై పడేలా చంద్రబాబు ప్లాన్ చేశారట. మరి బాబు ప్రణాళికలు ఎంతవరకు పార్టీకి ఎంతవరకు మైలేజ్ తెస్తాయో చూడాలి.
Also Read:రికార్డుల మోత..సౌతాఫ్రికా చిత్తు!