ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో నవ్వులు పూయించారు సీఎం చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న వారు నిల్చొవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనడంతో అసెంబ్లీలో దాదాపు 80% ఎమ్మెల్యేలు నిల్చున్నారు. దీంతో స్పీకర్‌తో సహా అంతా నవ్వుకున్నారు.
గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో విధ్వంస పాలన కొనసాగిందని మండిపడ్డారు చంద్రబాబు. జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండేందుకు అనర్హులన్నారు. మెరుగైన సమాజం రావాలంటే మంచి రాజకీయ వేత్తలు అధికారంలో ఉండాలని వెల్లడించారు.
జగన్ పాలనలో జరిగిన హత్యలు, అత్యాచారాలు, దాడులు, దోపిడీలు, నేరాలకు సంబంధించిన అంశాలను చంద్రబాబు స్లైడ్‌ల ద్వారా వివరించారు. కూటమి పాలనలో నేరాలను పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అరికడతామని స్పష్టం చేశారు.ప్రజాప్రతినిధులను కూడా ఎవరిని వదలలేదని ఆరోపించారు. జగన్ హయాంలో కేసులకు గురైన వారిని ఎన్నికల్లో గెలిపించి అసెంబ్లీకి పెద్ద సంఖ్యలో పంపించారని పేర్కొన్నారు. 2019-24 మధ్య కాలంలో ప్రభుత్వమే హింసను ప్రేరేపించిందని అన్నారు.
Also Read:BRS:కాళేశ్వరంకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో నవ్వుల పువ్వులు….
వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న వారు నిల్చొవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అనడంతో అసెంబ్లీలో దాదాపు 80% ఎమ్మెల్యేలు నిల్చున్న దృశ్యం.#NaraChandrababuNaidu #APAssembly #AndhraPradesh pic.twitter.com/jj69bjlkWW
— Telugu Desam Party (@JaiTDP) July 25, 2024