టీ-టీడీపీ పై బాబు ఫోకస్?

26
- Advertisement -

తెలంగాణలో టీడీపీపై అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఫోకస్ పెట్టబోతున్నారా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయాలని మొదట భావించినప్పటికీ ఆ టైమ్ లో బాబు జైల్లో ఉన్న కారణంగా అనూహ్యంగా టీడీపీ ఎన్నికల రేస్ నుంచి నిష్క్రమించింది. ఆ తర్వాత టీడీపీ అధ్యక్షుడిగా పని చేసిన కాసాని జ్ఞానేశ్వర్ అసహనంతో పార్టీకి గుడ్ బై చెప్పి ఆ వెంటనే ఆయన బి‌ఆర్‌ఎస్ లో చేరారు. ఇక అప్పటి నుంచి తెలంగాణ టీడీపీని లైట్ తీసుకుంటూ ఏపీ రాజకీయాలపైనే దృష్టి సారిస్తూ వచ్చారు అధినేత చంద్రబాబు నాయుడు. అయితే లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. .

అందులో భాగంగానే టీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిని నియమించే పనిలో ఉన్నారట. ప్రస్తుతం అధ్యక్ష పదవి ఖాళీగా ఉండడంతో వీలైనంత త్వరగా అధ్యక్ష నియామకం చేపట్టాలని బాబు చూస్తున్నారట. ప్రస్తుతం అధ్యక్ష రేస్ లో బక్కని నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి, నందమూరి సుహాసిని పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉందట. ఇక అధ్యక్ష పదవి నియామకం పూర్తయిన తర్వాత తెలంగాణలో వరుస సమావేశాలు, కార్యకర్తలతో మీటింగ్స్, బహిరంగ సభలు వంటి వాటికి కూడా చంద్రబాబు ప్లాన్ చేస్తునట్లు వినికిడి. అయితే అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, మరియు లోక్ సభ ఎన్నికలు ఏక కాలం జరిగే అవకాశం ఉండడంతో తెలంగాణ వైపు చంద్రబాబు ఎంతమేర సమయం కేటాయిస్తారనేది ప్రశ్నార్థకమే. మరి టీ టీడీపీని బలపరిచేందుకు బాబు ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

Also Read:చేవెళ్ల పార్లమెంట్ ప్రజాప్రతినిధులతో హరీష్‌ భేటీ

- Advertisement -