టీడీపీలో నారా లోకేష్ గెలుపు కోసం చంద్రబాబు భారీ స్కెచ్ వేశాడా ? మంగళగిరిలో లోకేష్ కు ఈసారి తిరుగులేదా ? అందుకోసం బాబు అమలు చేయబోతున్న వ్యూహమేంటి ? ఈ ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గత కొన్నాళ్లుగా టీడీపీలో నారా లోకేష్ బాగా హైలెట్ అవుతూ వస్తున్నారు. గతంలో ఆయన రాజకీయ తీరుపై తీవ్రమైన విమర్శలు, ట్రోల్స్ వెంటాడుతూ వచ్చాయి. అయితే వాటన్నిటిని అధిగమించి ప్రస్తుతం లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తన మాట తీరుతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈసారి లోకేష్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారా ? లేదా అనే దానిపై మొన్నటి వరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతూ వచ్చాయి. .
ఎందుకంటే గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణరెడ్డి చేతిలో ఓటమి పాలు అయ్యారు. అయితే ఇటీవల ఆళ్ల రామకృష్ణ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పడం వెనుక చంద్రబాబు వ్యూహం ఉందనేది కొందరు చెబుతున్నా మాట. మంగళగిరిలో వైసీపీ నుంచి ఆళ్ల పోటీలో లేకపోవడం వల్ల నారా లోకేష్ కు ప్లెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి షర్మిల ప్రాతినిధ్యం వహిస్తే కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆళ్లను టీడీపీలో చేర్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారట చంద్రబాబు. ఆర్కే ను టీడీపీలో చేర్చుకుంటే మంగళగిరిలో లోకేష్ కు తిరుగుండదు. అందుకోసమే తనయుడి గెలుపు కోసం చంద్రబాబు శతవిధాల ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు వ్యూహాలు లోకేష్ కు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.
Also Read:ఈ లక్షణాలు ఉంటే..కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లే!

