Kalki:అతిథిగా సీఎం, డిప్యూటీ సీఎం!

5
- Advertisement -

మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’. మ్యాసీవ్ అంచనాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ట్రైలర్‌లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన యాక్షన్ పవర్ ని ప్రజెంట్ చేసి, అశ్వత్థామ పాత్రకు ప్రాణం పోశారు.జూన్ 27న‌ ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు అతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు రానున్నాడని సమాచారం. నిర్మాత అశ్వీనిదత్‌కు చంద్రబాబుకు దగ్గరి సంబంధాలు ఉండటంతో అతిథిగా బాబును తీసుకురావాలని భావిస్తున్నారట.

చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని గెస్టులుగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్‌కు ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌ కూడా రానున్నారట. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ అమరావతిలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:‘చౌకీదార్’గా దియా ఫేమ్ పృథ్వీ

- Advertisement -